Thursday, June 24, 2010

ప్రెస్ నోట్

ఎమర్జన్సీ రోజులు భారతదేశ చరిత్ర లో చీకటి రోజులు: భాజపా
అర్ధరాత్రివేళ మన దేశం నెత్తిన అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎమర్జన్సీ రుద్ది నేటికి సరిగ్గా 35 ఏళ్ళు. ఆమె 1975 జూన్ 24 -25 అర్ధరాత్రి విధించిన ఎమర్జన్సీ 19 నెలలపాటు కొనసాగింది. ప్రజల ప్రాధమిక హక్కులను సస్పెండ్ చేసారు. ప్రసరమధ్యమలపై సెన్సార్షిప్ విధించారు . ఎమర్జన్సీ కి దారి తీసిన పరిస్థితులు ఒకసారి గమనించినట్లు అయితే loaksabha కు 1971 లో జరిగిన ఎన్నికలో రాయబరేలి నియోజకవర్గం లో ఇందిరాగాంధీ గెలుపొందారు. ఆ ఎన్నికలలో ఇందిరా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు రుజువు అయినందున ఆమె ఎన్నిక చెల్లనేరదని కోర్ట్ తీర్పు చెప్పిన దరిమిలా ఎమర్జన్సీ కధ మొదలు అయ్యింది. ఇందిర ఎన్నిక కొట్టివేస్తూ, ఆరేళ్ళపాటు ఆమె ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హులని కోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ లో జరిగే చర్చలు, వోటింగ్ లో పాల్గొనరాదని స్పష్తం చేసారు. కోర్ట్ తీర్పుని గౌరవించి ఆమె ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకోవాలి కానీ ఆమె దేశం లో ఎమర్జన్సీ ని విధించారు.
ఎమర్జన్సీ రోజుల్లో సర్కార్ తెచ్చిన రాజ్యాంగ సవరణలు మన రాజ్యాంగం మూలానే పెకలించాయి. ఇండియాను నియంతృత్వ పాలనలోకి నేట్టివేసాయి. అంతటి దురాగతానికి పాల్పడిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 1977 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గద్దె దించారు. ఎమర్జన్సీ రోజులలో భాజపా పార్టీ ఆవిర్భావానికి తొలి పునాది జరిగింది. ఎ.భి. వాజ్పాయి, ఎల్.కే. అద్వాని వంటి నాయకులూ సామాన్య ప్రజల వైపు పోరాటం చేసి విజయం సాధించారు. ఆనాటి నుండి నేటివరకు భాజపా, కాంగ్రెస్ పార్టీ దుస్ట్ట రాజకీయాలను సమర్దవంతం గ ఎదుర్కుని కాంగ్రెస్ పార్టి కి దేశం లో భలమైన ప్రత్యామ్నాయం గ నిలిచింది.
దేశం లో కళకళలాడుతున్న ప్రజాస్వామిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 1975 -77 మధ్య పూర్తిగా బ్రష్టు పట్టించి, నియంతృత్వం దిశగా నడిపించింది. అప్పట్లో తను వ్యవహరించిన తీరు పట్ల కాంగ్రెస్ లో ఈనాటికి పశ్చాతాపం కనపడం లేదు. కనుక ఇక ప్రజలే కాంగ్రెస్ పార్టి ని నిలదియాలి. ఎమర్జన్సీ రోజులలో కాంగ్రెస్ పార్టీ దురాగతాలను ప్రజలు మరోసారి గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీ వారిని నిలదియాలి అని భారతీయ జనత పార్టీ ద్వార ప్రజలకు పత్రికాముఖంగా విజ్ఞప్తి చెస్తునాము.
ఇట్లు
పట్టణ భాజపా శాఖ,
రాష్త్ర కార్యవర్గ సభ్యులు. జీరు. సత్యన్నారాయణ
అధ్యక్షులు : లంకాడ. బుచ్చి బాబు
కార్యదర్శి: పంపాన. శ్రీధర్
కరగాని. అప్పల నాయుడు.
గుజ్జు. రాము

No comments:

Post a Comment